![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -317 లో... సీతాకాంత్, రామలక్ష్మిల గొప్పతనం గురించి సిరి మాట్లాడుతుంది. సీతాకాంత్ అన్నయ్య వాళ్ళు ఇక్కడికి రావాలి లేదంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తానని సిరి ఎమోషనల్ అవుతూ కింద పడిపోతుంది.
మరొకవైపు సీతాకాంత్ వాళ్ళని స్టేషన్ నుండి విడిపించాడని రామలక్ష్మి మాట్లాడడం మానేస్తుంది. దాంతో సీతాకాంత్ బుజ్జగిస్తు ఉంటాడు. అప్పుడే శ్రీలత, సందీప్, ధన వాళ్ళు సీతాకాంత్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసి సీతాకాంత్ ఆశ్చర్యంగా.. మీరెందుకు వచ్చారు అని అడుగుతాడు. మమ్మల్ని క్షమించండి అన్నయ్య అంటూ సీతాకాంత్ కాళ్ళ మీద పడి సందీప్ రిక్వెస్ట్ చేస్తాడు. మీరే ఇప్పుడు మమ్మల్ని కాపాడాలంటూ సందీప్ అంటాడు. నన్ను క్షమించు సీతా.. ఇప్పుడు సిరికి బాగాలేదు. నువ్వు ఎలాగైనా ఇంటికి రావాలని శ్రీలత బ్రతిమిలాడుతుంది.
అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని రామలక్ష్మి అడుగుతుంది. నేను సీతాని చంపాలనుకోవడం తప్పే.. ఇప్పుడు ప్రాధేయపడుతున్నానని శ్రీలత అనగానే.. అసలు సిరికి ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. ఇక శ్రీలత జరిగింది అంత చెపుతుంది. డాక్టర్ వచ్చి సిరిని చెక్ చేసి ఇప్పుడు ఈవిడ ప్రశాంతంగా లేకపోతే తల్లి బిడ్డకి ఇద్దరికి ప్రమాదన్న విషయం చెప్తుంది. మీరేం చెప్పినా మేము నమ్మే సిచువేషన్ లో లేమని రామలక్ష్మి అంటుంది. నేను నమ్ముతానని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. రామలక్ష్మిని కూడా శ్రీలత రిక్వెస్ట్ చేస్తుంది. ఇది నిజమా, అబద్ధమా తేల్చుకోలేకపోతున్నానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |